Thursday, January 24, 2013

పరిచయం


ఎవరి కలల సామ్రాజ్యనికి వారే రారాజు.....ఎవరి కథలకి వారే కథా నాయకులు,,.. అందుకే ఈ బ్లాగ్ కి నా కలలు.. నా కథలు.. అని పేరు పెట్టాను.. 

ఈ  నా, మీ కలల ప్రపంచం లోకి మీ అందర్ని సాదరంగా  ఆహ్వనిస్తున్నాను...

ప్రతి కలకీ ఒక అర్ధం ఉంటుంది, ఆ కలకి మనకి సంబంధం ఉంటుంది. మనకి రోజూ ఏవో కలలు వస్తుంటాయి. అందులో మనకి చాలా వరకు గుర్తుండవు..గుర్తున్న వాటిలో చాలా వరకు అర్దం కావు.. కాని కొన్ని కలలు మన మనసుకి హత్తుకుంటాయి. కొన్ని భయపెడతాయి..ఇంకొన్ని భాదపెడతాయి..మరి కొన్ని నవ్వుకునేల ఉంటాయి.నాకు కలలంటే చాల ఇష్టం. ఎందుకoటే మన కలలు మన సొంతం. అక్కడ మనకిష్టమొచ్చినట్లు మనముండొచ్చు. మనకి నచ్చినవి మనం చెసేయొచ్చు. అక్కడ మనల్ని ఎవరూ ప్రశ్నించరు, మనం ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లెదు. అదొక ఊహాజనిత ప్రపంచం. ఆ ప్రపంచంలో ఉన్నంత సేపు అదే మన ప్రపంచం, అదే నిజం అనిపిస్తుంది. కొన్నిసార్లు అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. కొన్ని కలల్లో మన ఊహకి అందనివి, మనం నిజ జీవితంలో ఊహించలేనివి, మన ప్రమేయం లేనివి జరిగిపొతుంటాయి. కాని ఆ కలకీ మనకీ కచ్చితంగా ఏదో ఒక సంబంధం ఉంటుంది. కంగారు పడకండి. కలల గురించి నేను పరిశోధనలు చేయడం లేదు, వాటి మీద పుస్తకం కూడా రాయటం లేదు. కల అంటే నేను అర్ధం చేసుకున్న నిర్వఛనాన్ని మీకు అర్ధం అయ్యేలా చెప్పడానికి చేస్తున్న చిన్ని ప్రయత్నం అంతే.

ప్రతి మనిషికీ ఒక కల ఉంటుంది నేను అది అవ్వాలి నేను ఇది అవ్వాలి, ఏదైనా సాదించాలి అని. ఈ కల మనం రోజూ నిద్రలో కనే కలలలాంటిది కాదు. మనం నిద్రలో కనే కల ప్రయాణం. మనం సాదించాలి చేరుకోవాలి అనుకునే కల గమ్యం,. మన కలని సాధించడానికి మనమేమి ప్రయత్నం చేయకుండా వదిలెస్తే అది కలగానే మిగిలిపోతుంది. అలా కాకుండా మన కలని సాధించడానికి మనం పట్టుదలతో శ్రమిస్తుంటే ఆ కలే మన ఆశయం అవుతుంది. ఉదాహరణకి, నేను సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిలా గేయ రచయితని కావాలని కల కనేవాడ్ని. కాని నేను ఆ దిశగా అసలు ప్రయత్నించలేదు. అందుకే అది కలగానే మిగిలిపోయింది. అలా కాకుండా నేను ఆ కలనే ఆశయంగా పెట్టుకుని ప్రయత్నించి ఉంటే కనీసం ఆ రంగంలో అయినా ఉండేవాడ్ని.  

మీకు ఏవైనా కలలు ఉంటే, అవి జరగాలని కోరుకుంటే, వాటిని కల గానే వదిలేయకండి, ఆశయంగా మార్చుకోండి. ఆ ఆశయాన్ని సాధించండి. ఎందుకంటే కల అబద్ధం. ఆశయం నిజం.


ఇక కధల విషయానికి వస్తే, ఇక్కడ నేను అనగనగా కథలు, కాశీ మజిలీ కథలు చెప్పదల్చుకొలేదు. నా జీవితంలో, నాకు తెలిసిన వారి జీవితంలో ఎదురైన సంఘటనల్ని, కొన్ని కల్పనల్ని, ఇంకొన్ని అబద్ధాలని కలగలిపి మీకు కధలుగా చెప్పాలనుకుంటున్నా...

నిజానికి ప్రతి మనిషి జీవితం ఒక కధల పుస్తకంలాంటిది. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఒక కధ వంటిదే. ప్రతి కధ నుండి మనం ఎంతో కొంత నేర్చుకోవచ్చు.

నా ఆలోచనల్నీ, నా అనుభవాల్నీ, నా అనుభూతుల్నీ మీతో కథల రూపంలో ఈ బ్లాగ్ ద్వారా పంచుకోవాలనుకుంటున్నా...నా ఆలోచనని మన్నించి నన్ను ప్రోత్సహిస్తారని ఆదరిస్తారని ఆశిస్తూ.....
                                                                                                                        
                                                                                                                                     - బ్రహ్మ బత్తులూరి

2 comments:

  1. Wow chari bro. tholi parichayam lo ne aripinchav. sari leru neku maha prabhu neku

    ReplyDelete
  2. Nice to know that you started

    ReplyDelete